ముంబై: భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. వచ్చే వారం నుంచి స్వదేశంలో న్యూజిలాండ్తో మొదలుకావాల్సి ఉన్న వన్డే సిరీస్లో ఆడేందుకు అతడికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) నుంచి క్లియరెన్స్ వచ్చినట్టు తెలుస్తున్నది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో గాయపడి ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీతో అయ్యర్ రీఎంట్రీ ఇచ్చాడు.