న్యూఢిల్లీ : ముంబై ప్రధాన కార్యాలయం వేదికగా మార్చి 1వ తేదీన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్జీఎమ్) జరుగనుంది. ఈ భేటీలో బోర్డు కొత్త సంయుక్త కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. ఇప్పటి వరకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న దేవజిత్ సైకియా ప్రస్తుతం కార్యదర్శిగా ఏకగీవ్రంగా ఎన్నిక కావడంతో ఆ పదవి ఖాళీ అయింది. దీన్ని భర్తీ చేసేందుకు సింగిల్ పాయింట్ ఎజెండాతో ఎస్జీఎమ్ ఏర్పాటు చేస్తున్నట్లు అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు బీసీసీఐ నోటీసులు పంపింది. సంయుక్త కార్యదర్శి పదవి కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా, ఢిల్లీ క్రికెట్ సంఘం(డీడీసీఏ) చీఫ్ రోహన్ జైట్లీ, ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎమ్సీఏ) అధ్యక్షుడు సంజయ్ నాయక్ పోటీ పడుతున్నారు.