ఢిల్లీ: ఐపీఎల్-18 సీజన్ ఆరంభం కాబోయే ఈనెల 22న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కోల్‌కతా వేదికగా(ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కూడా అక్కడే) జరుగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశమవనుంది.
ఈ ఏడాది భారత్‌లో జరుగబోయే ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ కోసం ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు, ఐపీఎల్లో పొగాకు, మద్యం సంబంధిత ఉత్పత్తుల యాడ్స్‌పై నిషేధం విధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరిన దానిపై అపెక్స్ కౌన్సిల్ ప్రధానంగా చర్చించనుంది. మహిళల వన్డే ప్రపంచకప్ సంబంధించిన వేదికలపైనా చర్చించే చాన్స్ ఉన్నట్లు తెలిసింది.