ముంబై : స్వదేశం వేదికగా జరుగనున్న అంతర్జాతీయ సిరీస్‌ల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్‌లో కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరుగాల్సిన భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్‌ను ఢిల్లీకి బదిలీ చేశారు. దీనికి తోడు నవంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు ఢిల్లీలో జరుగాల్సిన భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు వేదికను కోల్‌కతా మార్చారు. వీటికి సంబంధించిన రీషెడ్యూల్‌ను బీసీసీఐ సోమవారం విడుదల చేసింది.
మరోవైపు స్వదేశం వేదికగా జరుగనున్న మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు సన్నాహకంగా భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను చెన్నై నుంచి న్యూచండీగఢ్, ఢిల్లీకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బెంగళూరు తొలి, ఫైనల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వబోతున్నది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తొలిసారి ‘ఏ’ జట్లతో అనధికారిక టెస్టు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.