Hyderabad | ఢిల్లీ: ఈ ఏడాది స్వదేశంలో భారత క్రికెట్ జట్టు ఆతిథ్యమివ్వబోయే క్రికెట్ సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో రెండు టెస్టులు ఆడనున్న టీమ్ఇండియా.. నవంబర్-డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే హైదరాబాద్‌కు ఒక్క మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం లభించలేదు. రొటేషన్ పద్ధతికి దాదాపు తిలోదాఖలు ఇచ్చిన బోర్డు హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోమారు నిరాశనే మిగిల్చింది. విండీస్‌తో అక్టోబర్ 6న అహ్మదాబాద్‌లో తొలి టెస్టు, 14 నుంచి కోల్‌కతాలో రెండు టెస్టు జరుగనుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ వివరాలు కింది విధంగా ఉన్నాయి.
నవంబర్ 18 తొలి టెస్టు ఢిల్లీ
నవంబర్ 26 రెండో టెస్టు గువహతి
నవంబర్ 30 తొలి వన్డే రాంచీ
డిసెంబర్ 03 రెండో వన్డే రాయ్‌పూర్
డిసెంబర్ 06 మూడో వన్డే వైజాగ్
డిసెంబర్ 09 తొలి టీ20 కటక్
డిసెంబర్ 11 రెండో టీ20 చండీగఢ్
డిసెంబర్ 14 మూడో టీ20 ధర్మశాల
డిసెంబర్ 17 నాలుగో టీ20 లక్నో
డిసెంబర్ 19 ఐదో టీ20 అహ్మదాబాద్