ముంబై: ఇంగ్లండ్ పర్యటన కోసం భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈనెల 28 నుంచి మొదలయ్యే సిరీస్‌లో టీమ్ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు, 3 వన్డేలు జరుగనున్నాయి. ఇందుకోసం బోర్డు మహిళా సెలెక్షన్ కమిటీ వేర్వేరు జట్లను ఎంపిక చేసింది.
ఇటీవలే శ్రీలంకతో సిరీస్ ఆడి గాయపడ్డ యువ క్రికెటర్ సుచి ఉపాధ్యాయ స్థానంలో సీనియర్ ఆల్‌రౌండర్ రాధాయాదవ్ను జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహించిన సన్నాహక క్యాంప్‌లో సుచి గాయపడిందని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.