ఢిల్లీ: మీడియా దిగ్గజం బీబీసీ ప్రతియేటా అందజేసే ‘బీబీసీ ఇండియా స్పోర్ట్స్‌ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’లకు నిరుడు అంతర్జాతీయ క్రీడా యవనికపై మువ్వన్నెల కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన పలువురు క్రీడాకారులు చోటు దక్కించుకున్నారు.
అవార్డుకు నామినేట్ అయినవారిలో టీమ్ఇండియా మహిళా క్రికెట్ జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, చెస్ సంచలనం దివ్య దేశ్‌ముఖ్, షూటింగ్లో పతకాలు కొల్లగొడుతున్న సురుచి సింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ పోటీలో ఉన్నారు. మరి వీరిలో అవార్డు ఎవరిని వరిస్తుందనేది త్వరలో తేలనుంది.