IND vs BAN : ఆసియా కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టు సూపర్ 4 రెండో మ్యాచ్ ఆడుతోంది. తొలి పోరు శ్రీలంకను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌ను టీమిండియా ఢీకొడుతోంది. చెరొక విజయంతో ఫైనల్ రేసులో ముందున్న రెండు జట్లకు ఈ మ్యా్చ్ చాలా కీలకం. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ గేమ్‌లో టాస్ గెలిచిన బంగ్లా సారథి జకీర్ అలీ (Jaker Ali) ఛేదనకు మొగ్గు చూపాడు. దాంతో.. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టాప్ గన్స్ మరోసారి ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేస్తే.. బంగ్లాకు కష్టాలు తప్పకపోవచ్చు. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను దృష్టిలో ఉంచుకొని నాలుగు మార్పులతో ఆడుతోంది బంగ్లా.. భారత్ మాత్రం పాక్‌ను చిత్తు చేసిన అదే జట్టుతోబరిలోకి దిగుతోంది.
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తే సూర్యకుమార్ సేన దాదాపు ఫైనల్ చేరినట్టే. మరోవైపు బంగ్లా కూడా విక్టరీతో ఫైనల్ బెర్తు సాధించాలనే పట్టుదలతో ఉంది. అయితే.. నెట్స్‌లో గాయపడిన కెప్టెన్ లిటన్ దాస్ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో జకీర్ అలీ సారథిగా వ్యవహరిస్తున్నాడు. గత రికార్డులు చూస్తే.. ఇప్పటివరకూ17 టీ20ల్లో భారత జట్టు చేతిలో పదహారింట ఓడిన ఆ టీమ్ అద్భుతం చేస్తే తప్ప గెలవడం అసాధ్యమే.
Toss: Bangladesh win and will bowl first. No Litton Das, he’s out injured
LIVE: https://t.co/U86524etjF pic.twitter.com/rY9D1llZw5
— ESPNcricinfo (@ESPNcricinfo) September 24, 2025
భారత తుది జట్టు : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, బుమ్రా,
బంగ్లాదేశ్ తుది జట్టు : సైఫ్ హసన్, తంజిద్ హసన్, పర్వేజ్ హొసేన్, తౌహిద్ హ్రిదయ్, షమీమ్ హొసేన్, జకీర్ అలీ (కెప్టెన్, వికెట్ కీపర్), మొహమ్మద్ సైఫుద్దీన్, రిషధ్ హొసేన్, తంజిమ్ హసన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్.