ఢాకా: బంగ్లాదేశ్ జట్టు సంచలనం సృష్టించింది. టీ20 ఫార్మాట్లో తొలిసారి ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గి చరిత్రకెక్కింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే బంగ్లా 3-0తో సిరీస్ పట్టేసింది. కంగారూలపై ఏ ఫార్మాట్లోనైనా బంగ్లాకు ఇదే మొదటి సిరీస్ విజయం కావడం విశేషం. శుక్రవారం జరిగిన మూడో టీ20లో బంగ్లా 10 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేయగా.. ఛేదనలో ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి 117 పరుగులకే పరిమితమైంది. ముస్తఫిజుర్ (0/9), షరీఫుల్ (2/29), షకీబ్ (1/22), నసుమ్ (1/19) ధాటికి కంగారూలు పరుగులు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు.