దుబాయ్: బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే జలక్ ఇచ్చింది ఇండియా(BANvIND). టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. ఫస్ట్, సెకండ్ ఓవర్లలో వికెట్లను కోల్పోయింది. షమీ వేసిన తొలి ఓవర్లో సౌమ్యా సర్కార్ అవుట్ కాగా, రాణా వేసిన రెండో ఓవర్లో నజ్మల్ షాంతో ఔట్ అయ్యాడు. కేవలం రెండు పరుగుల స్కోరుకే రెండు వికెట్లను బంగ్లాదేశ్ కోల్పోయింది. సర్కార్, షాంతోలు ఇద్దరూ డకౌట్ అయ్యారు.
The Perfect Start 👌
Mohd. Shami and Harshit Rana both with the wickets for #TeamIndia 👏
Updates ▶️ https://t.co/ggnxmdG0VK#BANvIND | #ChampionsTrophy | @MdShami11 pic.twitter.com/f2b7pvn2FU
— BCCI (@BCCI) February 20, 2025
ఈ మ్యాచ్‌కు ముగ్గురు స్పిన్నర్లతో ఇండియా బరిలోకి దిగుతున్నది. జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్.. బౌలింగ్ లైనప్‌లో ఉన్నారు. జడేజా, అక్షర్ ఆల్‌రౌండర్లు కాగా, కుల్దీప్ తన మణికట్టుతో మాయ చేయనున్నాడు.