Nasir Hussain : అవినీతి కేసులో రెండేళ్ల నిషేధానికి గురైన క్రికెటర్ నాసీర్ హుస్సేన్ (Nasir Hussain) మళ్లీ మైదానంలో అడుగు పెట్టనున్నాడు. సస్పెన్షన్ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) అతడికి పునరాగమనానికి మార్గం సుమగం చేసింది. దాంతో, బంగ్లాదేశ్‌కు చెందిన 33 ఏళ్ల హుసేన్ ఫ్రాంచైజీ క్రికెట్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. క్రికెట్లో అవినీతికి నిరోధక విభాగం నియమ నిబంధనలను ఉల్లఘించినందుకు 2023 సెప్టెంబర్‌లో హుసేన్‌పై 6 నెలల నిషేధం విధించింది ఐసీసీ.
హుసేన్ తనకు బహుమతిగా లభించిన ఐఫోన్ 12 గురించి ఐసీసీ అవినీతి నిరోధక విభాగం అధికారులకు సమాచారం ఇవ్వలేదు. అసలు, ఆ గిఫ్ట్ అతడికి ఎవరు ఇచ్చారు? బదులుగా ఏమి ఆశించారు? అనే విషయాలు వెల్లడించలేదు. వీటితో పాటు విచారణ సమయంలో అధికారులకు సహకరించలేదు అనే అభియోగంతో హుసేన్‌పై రెండేళ్ల నిషేధం విధించింది ఐసీసీ. ఆ నిషేధాన్ని రెండేళ్లకు పొడిగించింది. అప్పటి నుంచి ఈ ఆల్‌రౌండర్ ఆటకు దూరమయ్యాడు.
Nasir has been ✅ cleared by the ICC to resume official cricket.#NassirHossain #DPL2025 #WaltonSmartFridge pic.twitter.com/Xb0YwiqLp4
— bdcrictime.com (@BDCricTime) April 7, 2025
‘ఐసీసీ విధించిన ఆంక్షలు, నిషేధం ముగియడంతో హుసేన్ ఇప్పుడు క్రికెట్ ఆడేందుకు అన్నివిధాలా అర్హత సాధించాడు. అతడికి అవినీతి నిర్మూలనకు సంబంధించిన క్లాసులకు అతడు హాజరవుతాడు. ఫలితంగా ఏప్రిల్ 7వ తేదీ నుంచి అతడు మళ్లీ క్రికెటర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగించనున్నాడు’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
దేశవాళీలో బ్యాటుతో, బంతితో రాణించిన హుసేన్ 2011లో అరంగేట్రం చేశాడు. మూడు ఫార్మట్లలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2018 వరకూ అంటే.. ఏడేళ్ల కాలంలో అతడు దేశం తరఫున 115 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 19 టెస్టులు, 65 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో రూప్‌గంజ్ టైగర్స్ ఆటగాడిగా అతడు బరిలోకి దిగనున్నాడు.