England Captain : ఇంగ్లండ్ (England) వన్డే జట్టు (One day team) కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ (Harry Brook) ను ఎంపిక చేశారు. హ్యారీ బ్రూక్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. అందుకు బాధ్యత వహిస్తూ జాస్ బట్లర్ (Jos Buttler) తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. బట్లర్ స్థానంలో ఇప్పుడు నూతన కెప్టెన్‌గా బ్రూక్‌ను ఎంపిక చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా ఆస్ట్రేలియాతో, ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలో ఇంగ్లండ్ ఓడింది. దాంతో ఇంగ్లండ్ సెమీస్ ద్వారాలు మూసుకుపోయాయి. వర్క్‌లోడ్ పేరుతో హ్యారీ బ్రూక్ 2025 ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్నాడు. దాంతో అతనిపై ఐపీఎల్లో ఆడకుండా రెండేళ్ల నిషేధం పడింది. 2022 జనవరిలో జట్టులోకి వచ్చింది మొదలు హ్యారీ బ్రూక్, వన్డే, టీ20 మ్యాచ్‌లలో సత్తా చాటుతున్నాడు.
టెస్టు క్రికెట్లో కూడా బ్రూక్ అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌కు సంబంధించి ఐసీసీ వరల్డ్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో బ్రూక్ రెండో స్థానంలో ఉన్నాడు. 26 ఏళ్ల బ్రూక్ ఏడాది కాలంగా వన్డే, టీ20 మ్యాచ్‌లలో ఇంగ్లండ్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. గత సెప్టెంబర్‌లో బట్లర్ అందుబాటులో లేకపోవడంతో ఆస్ట్రేలియాతో సిరీస్‌కు కెప్టెన్‌గా కూడా బ్రూక్ వ్యవహరించాడు.