భోపాల్: చిరుత, దాని పిల్లలకు ఒక డ్రైవర్ తాగు నీరు అందించాడు. (Water To Cheetahs) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అటవీ శాఖ అధికారులు అతడిపై చర్యలు చేపట్టారు. విధుల నుంచి తొలగించారు. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. నమీబియా నుంచి తరలించిన చిరుతల్లో ఒకటైన జ్వాల తన పిల్లలతో కలిసి అటవీ సమీప ప్రాంతాల్లో సంచరిస్తున్నది.
కాగా, చిరుత జ్వాల తన పిల్లలతో కలిసి ఒక చోట విశ్రాంతి తీసుకుంటున్నది. అయితే అటవీ శాఖ విధుల కోసం నియమించిన డ్రైవర్ వాటి చెంతకు వెళ్లాడు. ఒక గిన్నెలో నీరు పోశాడు. వాటిని రమ్మని పిలిచాడు. స్పందించిన చిరుత జ్వాలా చాలా ప్రశాంతంగా అతడి వద్దకు వచ్చింది. ఆ చిరుతతోపాటు దాని పిల్లలు ఆ గిన్నెలోని నీటిని తాగాయి.
మరోవైపు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన ఆ వ్యక్తిపై అటవీ శాఖ అధికారులు క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. రోజు వారీ వేతనం కింద నియమించిన ఆ డ్రైవర్ను విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
Viral video shows a man offering water to cheetahs in MP’s Kuno National Park — a gesture of coexistence after recent clashes. But the forest department suspended the driver, fearing human-animal bonds. pic.twitter.com/AMW70XQPLt
— 𝐃𝐎 𝐍𝐞𝐰𝐬 (@donewstoday) April 7, 2025