Bangladesh Cricket : భారత్‌లో టీ20 వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తీవ్ర పరిణామాలు ఎదుర్కోనుంది. అత్యంతస సంపన్నమైన బీసీసీఐ (BCCI)కు ఎదురు తిరిగినందుకు, ఐసీసీ అభ్యర్థనను పెడచెవిన పెట్టినందుకు రాబోయే రోజుల్లో ఆ దేశ బోర్డు భారీ నష్టాలు చవిచూడనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి ఏటా లభించే రూ.240 కోట్ల ఆదాయాన్ని ఆ బోర్డు కోల్పోనుంది. అంతేకాదు స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్లు కూడా బంగ్లా బోర్డు ముఖం చూడడం చూడకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆడడం లేదు. భద్రతా కారణాల రీత్యా భారత్‌లో ఆడలేమని బెట్టు చేసినందుకు ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది ఐసీసీ. ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు చోటు కల్పించింది. భారత్‌లో ప్రపంచకప్‌ను బాయ్‌కాట్ చేసినందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారీ మూల్యం చెల్లించుకుంది. ఇకపై ఆ దేశ బోర్డుకు గడ్డుకాలం ఎదురవ్వడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే.. ఐసీసీతో విభేదించినందున వాటాగా అందాల్సిన రూ.240 కోట్ల ఆదాయం బీసీబీకి అందదు.
🚨 CONSEQUENCES FOR BANGLADESH IF THEY BOYCOTT T20 WC 🚨
– 240 Crores loss of ICC revenue
– Broadcaster’s loss
– Sponsorship loss
– Board’s income will drop by nearly 60% or even more
– India may not tour to Bangladesh in Aug-Sep– What’s your take 🤔 pic.twitter.com/bHVVVBuMMV
— Richard Kettleborough (@RichKettle07) January 24, 2026
భద్రత కారణాలరీత్యా భారత్‌లో వరల్డ్‌కప్ ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం వారి పాలిట శాపం కానుంది. ఇకపై పాకిస్థాన్ బోర్డుతో వ్యవహరిస్తున్నట్టే బంగ్లా బోర్డుతోనూ బీసీసీఐ అంటీముట్టనట్టుగా ఉండనుంది. ఇంతకుముందులా భారత జట్టు ఆ దేశంతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకపోవచ్చు.
Scotland will be heading to their seventh men’s #T20WorldCup due to Bangladesh’s refusal to travel to India due to security concerns, joining England, Italy, Nepal and West Indies in Group C
Details: https://t.co/Vy9TdM75Td pic.twitter.com/ZFHHtJgPZb
— ESPNcricinfo (@ESPNcricinfo) January 24, 2026
మరో ముఖ్యమైన విషయం.. వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ ఈవెంట్లలో, ఆసియా క్రికెట్ నిర్వహించే ఆసియా కప్‌లో మాత్రమే బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడే అవకాశముంది. అది కూడా తటస్థ వేదికపై ఇరుజట్లు ఢీకొనేందుకు ఆస్కారముంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు – సెప్టెంబర్‌లో వైట్‌బాల్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ వెళ్లాల్సిన భారత జట్టు పర్యటనను రద్దు చేసుకోనుంది.
BREAKING: Bangladesh have been replaced at the ICC Men’s T20 World Cup 2026 following their refusal to play in India
Scotland will replace them in Group C at the tournament
Full story: https://t.co/J3KzzZNLZ6 pic.twitter.com/WpzyY2ne2x
— ESPNcricinfo (@ESPNcricinfo) January 24, 2026
దాంతో.. టీమిండియాతో సిరీస్‌తో మ్యాచ్ టికెట్లు అమ్మి, బ్రాడ్‌కాస్టింగ్, స్పాన్సర్ల ద్వారా భారీగా ఆర్జించాలనుకున్న బీసీబీ ఆశలు ఆవిరికానున్నాయి. అంతేకాదు ఐపీఎల్(IPL)లో బంగ్లాదేశ్ ఆటగాళ్లపై నిషేధం విధించే అవకాశాల్ని కొట్టిపారేయలేం.