Bangladesh : పసికూనగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ (Bangladesh) సంచలన విజయాలకు కేరాఫ్‌గా మారింది. మూడు ఫార్మాట్లతో అద్భుత ఆటతో పెద్ద జట్లకు షాకిస్తూ వచ్చిన బంగ్లా.. టెస్టు హోదా పొంది 25 ఏళ్లు అవుతోంది. సరిగ్గా.. పాతికేళ్ల క్రితం ఇదే రోజున ఆ జట్టుకు సుదీర్ఘ ఫార్మాట్లో ఈ గుర్తింపు లభించింది. అందుకే.. తమ క్రికెట్లో చిరస్మరణీయమైన రోజైన జూన్ 26న బంగ్లా క్రికెట్ బోర్డు షేర్ ఏ బంగ్లా స్టేడియంలో గురువారం రజతోత్సవాలను నిర్వహించింది.
రజతోత్సవాల సందర్భంగా బీసీబీ అధికారులు తమ దేశంలో టెస్టు క్రికెట్‌కు విశేష సేవలందించిన వాళ్ల పేర్లతో ఏర్పాటు చేసిన బోర్డును ప్రారంభించారు. ఈ లిస్ట్‌లో మాజీ క్రికెటర్లు, ప్రస్తుతం జట్టుతో కొనసాగుతున్న ఆటగాళ్ల పేర్లు కూడా ఉన్నాయి.
Scenes from today’s reception accorded to the inaugural Test team at the Sher-e-Bangla National Cricket Stadium, Mirpur on the occasion of the 25th anniversary of attaining Test status. pic.twitter.com/XTMn2TRXJj
— Bangladesh Cricket (@BCBtigers) June 26, 2025
‘టెస్ట్ హానర్స్ బోర్డు’లో .. దిగ్గజం అక్రమ్ ఖాన్, హబీబుల్ బషర్, ముష్రఫే మొర్తాజా, తమీమ్ ఇక్బాల్, షకీబుల్ హసన్‌లకు చోటు దక్కింది. ప్రస్తుత తరంలోని నయీం హసన్, నహిద్ రానాలు కూడా ఈ జాబితాలో పేరు సంపాదించారు. టెస్టు హోదా పొందిన తర్వాత గ్లాదేశ్ 2000 నవంబర్10న భారత జట్టుతో తొలి మ్యాచ్ ఆడింది.