బంగ్లా 21 ఏండ్ల తర్వాత..
బంగ్లాదేశ్ కొత్త చరిత్ర లిఖించింది. తమ సొంత ఇలాఖాలో ఆస్ట్రేలియాను మట్టికరిపించి వన్డేల్లో 21 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. మంగళవారం వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో బంగ్లా 86 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) ఆసీస్‌పై చారిత్రక విజయం సాధించింది.
- వన్డేల్లో ఆసీస్‌పై విజయం
మిర్పూర్: బంగ్లాదేశ్ కొత్త చరిత్ర లిఖించింది. తమ సొంత ఇలాఖాలో ఆస్ట్రేలియాను మట్టికరిపించి వన్డేల్లో 21 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. మంగళవారం వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో బంగ్లా 86 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) ఆసీస్‌పై చారిత్రక విజయం సాధించింది. వన్డేల్లో చివరిసారి 2005లో ఆసీస్‌పై గెలిచిన బంగ్లా ఇన్నేండ్లకు మళ్లీ ఆ జట్టును ఓడించింది. తొలుత మొసాదెక్ హుస్సేన్(70 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లతో 86 నాటౌట్)కు తోడు నజ్ముల్ హుస్సేన్ శాంటో (67), తంజిద్ హసన్ (54) అర్ధసెంచరీలతో బంగ్లా 50 ఓవర్లలో 284/8 స్కోరు చేసింది.
నాథన్ ఎలిస్ (3/38) మూడు వికెట్లు తీయగా, స్కాట్ (2/57), రెన్షా (2/5) ఆకట్టుకున్నారు. నాలుగు క్యాచ్‌లు విడిచిపెట్టిన ఆసీస్ భారీ మూల్యం చెల్లించుకుంది. అనంతరం ఛేదనలో ఆసీస్ 42.2 ఓవర్ల లో 191/9 స్కోరు తో నిలిచిన దశలో వర్షంతో మ్యాచ్ ఆగిపోగా డక్‌వర్త్ ప్రకారం బంగ్లా ఘన విజయం సొంతం చేసుకుంది.కామెరాన్ గ్రీన్ (52 నాటౌట్) అర్ధసెంచరీతో రాణించగా, మిగతావారు స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. నహిద్ రాణా (4/41) నాలుగు వికెట్లతో ఆసీస్ పతనంలో కీలకమయ్యాడు. అర్ధసెంచరీకి తోడు రెండు వికెట్లు తీసిన హుస్సేన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

