NZ vs BAN : బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డే రద్దు అయింది. వర్షం కారణంగా అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. 33.4 ఓవర్ల వద్ద వాన మొదలైంది. అప్పటికీ న్యూజిలాండ్ స్కోర్ 136/5. టామ్ బండిల్(8 నాటౌట్), గోలె మెక్కొంచీ(8 నాటౌట్) క్రీజులో ఉన్నారు. అయితే.. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో రిఫరీ మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు.
ఆసియా కప్‌లో నాకౌట్లోనే వెనుదిరిగిన బంగ్లాకు, గాయాలతో సతమవుతున్న కివీస్‌కు ఈ వన్డే సిరీస్ చాలా కీలకం. వరల్డ్ కప్ ముందు ఇరుజట్లు సత్తా చాటాలని భావించాయి. అయితే.. మ్యాచ్ వర్షార్ఫణం కావడంతో కివీస్, బంగ్లా ఆటగాళ్లు ఉసూరుమన్నారు. రెండో వన్డే సెప్టెంబర్ 23న జరుగనుంది.