Virat Kohli : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో తన బ్యాటింగ్‌తోనే కాకుండా హావభావాలు, గెలువాలన్న కసితో అతడు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కోహ్లీని ఇష్టపడే వాళ్లు భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ ఎందరో ఉన్నారు. ఆసియా కప్(Asia cup 2023)లో శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బలూచిస్థాన్ అభిమానులు(Balochistan Fans) కోహ్లీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. అదేంటో తెలుసా..? ఇసుక మీద కింగ్ కోహ్లీ బొమ్మ, ఆ పక్కనే ఇద్దరు ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుతున్న వీడియో.
విరాట్‌పై వెరైటీగా తమ అభిమానం చాటుకున్న బలూచిస్థాన్ ఫ్యాన్స్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కేవలం విరాట్ ఆట చూడటానికే పాకిస్థాన్ నుంచి శ్రీలంకకు వచ్చానని ఓ మహిళా అభిమాని చెప్పిన వీడియో కూడా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 4 పరుగులతో నిరాశ పరిచిన విషయం తెలిసిందే. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు చెరొక పాయింట్ వచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్(International Cricket) ఆడుతున్న ప్లేయర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ గుర్తింపు సాధించాడు.
విరాట్ కోహ్లీ
ఈ స్టార్ బ్యాటర్ ఆసియాకప్‌తో పాటు, వన్డే ప్రపంచ కప్‌లో రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోమవారం నేపాల్‌తో టీమ్ఇండియా తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. సూపర్ -4కు ముందు కీలకమైన ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.