బుధవారం 08 జూలై 2020
Sports - Apr 27, 2020 , 18:13:00

‘హర్యన్వీ’ పాటకు రెజ్లర్​ బజరంగ్ డ్యాన్స్​

‘హర్యన్వీ’ పాటకు రెజ్లర్​ బజరంగ్ డ్యాన్స్​

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం కారణంగా క్రీడాపోటీలు నిలిచిపోవడంతో అథ్లెట్లు ఇండ్లకే పరిమితమయ్యారు. కుటుంబంతో సంతోషంగా గడపడంతో పాటు తమలోని ఇతర టాలెంట్​లను బయటపెడుతున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత స్టార్ రెజ్లర్​ బజరంగ్ పునియా చేరాడు. హర్యన్వీ భాషకు చెందిన ఓ పాపులర్​ పాటకు బజరంగ్​ అదిరిపోయేలా డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్​ ట్విట్టర్​లో పోస్ట్ చేసింది.  కాగా, కరోనా వైరస్​పై జరుగుతున్న పోరాటానికి సాయంగా బజరంగ్ తన ఆరు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2019 రెజ్లింగ్ ప్రపంచ చాంపియన్​షిప్​లో కాంస్యం సాధించిన బజరంగ్ పునియా ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు.


logo