Virat Kohli | టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీల్లో బరిలోకి దిగుతున్నాడు. ఈ నెల 30 నుంచి రైల్వేస్‌తో జరుగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టుతో చేరిన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. కోహ్లీ చివరిసారిగా 2012లో ఘజియాబాద్‌లో ఉత్తరప్రదేశ్‌తో చివరి రంజీ మ్యాచ్‌ను ఆడిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అంతర్జాతీయ సెంచరీ సాధించిన ఢిల్లీ ఆటగాడు.. ఇటీవల ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నాడు. మంగళవారం ఉదయం 9గంటలకు అరుణ్‌జైట్లీ స్టేడియానికి చేరిన విరాట్.. ఆ తర్వాత జట్టుతో కలిసి వార్మప్ చేశాడు. ఆ తర్వాత దాదాపు 15 నిమిషాలు ఫుట్‌బాల్ ఆడాడు. ఢిల్లీ ఆటగాళ్లు కోహ్లీతో తొలిసారిగా డ్రెస్సింగ్ రూమ్ పంచుకోగా.. ప్లేయర్ అంతా ఉత్సాహంగా కనిపించారు. ఇక మ్యాచ్‌కు డీడీసీఏ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. సాధారణంగా రంజీ మ్యాచ్ కోసం భద్రతను పెంచనున్నట్లు పేర్కొన్నారు.
ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు డీడీసీఏ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. చాలా సంవత్సరాల తర్వాత విరాట్ ఆడుతున్న మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చేసే అవకాశం లేనట్లు తెలుస్తుంది. అయితే, రోహిత్ ఆడిన మ్యాచ్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ-రైల్వేస్ మ్యాచ్‌కు లైవ్ స్ట్రీమింగ్ ఉండే అవకాశం లేదని డీసీసీఏ వర్గాలు పేర్కొన్నాయి. బీసీసీఐ చివరి నిమిషంలో ఏదైనా ఏర్పాట్లు చేయవచ్చని, తమకు సమాచారం లేదని తెలిపాయి. ఈ మ్యాచ్ ప్రసారం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని.. సాధారణంగా అన్ని ప్రధాన కేంద్రాల్లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుందని.. గతంలో తమిళనాడు మ్యాచ్‌కు లైవ్ ఇచ్చిన సందర్భాలున్నాయని డీడీసీఏ వర్గాలు పేర్కొన్నాయి.
బ్రాడ్కాస్ట్ రోస్టర్ పద్ధతిలో స్ట్రీమింగ్ చేసేందుకు ముందుగానే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపాయి. ముంబయి-జమ్మూ కశ్మీర్ మధ్య జరిగే మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే నిర్ణయం చాలా రోజుల కిందటనే తీసుకున్నట్లు చెప్పారు. మ్యాచ్‌లో రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ ఆడడం యాదృశ్చికమని పేర్కొన్నారు. అయితే, ఢిల్లీ-రైల్వేస్ మ్యాచ్‌కు కవరేజీ లేకపోయినా.. కర్ణాటక-హర్యానా మ్యాచ్‌ను లైవ్ చూసే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా.. విరాట్ ఆడే మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని భావిస్తే మాత్రం ప్రత్యేకంగా మల్టీ కెమెరా సెటప్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇది సవాల్‌తో కూడుకున్నదేనని ఢిల్లీ క్రికెట్ సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఆయుష్ బదోని (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ప్రణవ్ రాజ్‌వంశీ (వికెట్ కీపర్), సనత్ సంగ్వాన్, అర్పిత్ రాణా, మయాంక్ గుసాయి, శివం శర్మ, సుమిత్ మాథుర్, వంశ్ బేడి (వికెట్ కీపర్), మణి గ్రేవాల్, హర్ష్ త్యాగి, సిద్ధాంత్ శర్మ, నవదీప్ సైని , యష్ ధుల్, గగన్ వాట్స్, జాంటీ సిద్ధు, హిమ్మత్ సింగ్, వైభవ్ కంద్పాల్, రాహుల్ గెహ్లాట్, జితేష్ సింగ్.
Virat Kohli | ఢిల్లీ రంజీ జట్టులోకి చేరిపోయిన కోహ్లీ.. అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్