Babar Azam : ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో ఆరంభించిన పాకిస్థాన్(Pakistan) రెండో టెస్టు కోసం సిద్ధమవుతోంది. తొలి టెస్టులో 360 పరుగుల భారీ తేడాతో ఓడిన షాన్ మసూద్(Shan Masood) సేన మెల్బోర్న్ టెస్ట్ కోసం నెట్స్‌లో చెమటోడ్చుతోంది. శుక్రవారం పాక్ జట్టు ప్రాక్టీస్ సెషన్(Practice Session)లో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
స్టేడియానికి వచ్చిన అభిమానులు మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam) ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. బాబర్ అందరికీ ఆటోగ్రాఫ్ ఇస్తుండగా.. ఒక మహిళా అభిమాని అతడు పెట్టుకున్న క్యాప్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలని కోరింది. అందుకు బాబర్ ఏమాత్రం మొహమాటపడకుండా నో చెప్పాడు. ‘నా వద్ద ఇదొక్కటే క్యాప్ ఉంది. ఇవ్వడం కుదరదు’ అని సదరు ఫ్యాన్‌కు సున్నితంగా చెప్పేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Fan – Bhai mujhe aapki hat chahiye (bro, I want your hat)
Babar – Mere paas bhi ek hi hai (I have only one)
— Cricketopia (@CricketopiaCom) December 21, 2023
వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు ఘోర వైఫల్యంతో బాబర్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో షాన్ మసూద్ టెస్టు పగ్గాలు చేపట్టాడు. దాంతో, బాబర్ ఒత్తిడి లేకుండా ఆడతాడని అంతా ఊహించారు. కానీ, ఆసీస్ పర్యటనలో ఈ స్టార్ బ్యాటర్ తీవ్రంగా నిరాశపరిచాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌ల్లో 21, 14 పరుగులకే వెనుదిరిగాడు. కంగారూ పేసర్లు స్టార్క్, హేజిల్‌వుడ్ విజృంభించడంతో పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 89 రన్స్‌కే ఆలౌటయ్యింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మెల్బోర్న్లో డిసెంబర్ 26న మొదలవ్వనుంది.