ఇటీవల విడుదలై తమిళంలో మంచి ఆదరణ సొంతం చేసుకున్న క్రైమ్ డ్రామా ‘డోరతి’ తెలుగులో రానుంది. కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలు పొందింది. కులం, హింస, పురుషాధిక్య భావజాలంతో సాగే ఈ గ్రామీణ కథాంశమిది. ఇద్దరు స్నేహితుల చుట్టూ నడిచే ఈ కథలో.. డోరతి అనే మహిళ ప్రవేశించి వారి జీవితాల్ని ఎలా ప్రభావితం చేసిందన్నదే సినిమా ఇతివృత్తం.
ఇందులో కీర్తి సురేష్ స్క్రీన్స్పేస్ తక్కువే అయినప్పటికీ హింస నుంచి మనుషుల్ని పరివర్తన వైపు నడిపించే మహిళగా కథాగమనంలో కీలకంగా ఉంటుంది. రానాకు చెందిన స్పిరిట్ మీడియా సంస్థ తెలుగులో ఈ సినిమా హక్కుల్ని దక్కించుకుంది. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.