Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam) మరో రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుడిగా చరిత్ర సృష్టించాడు. దాంతో, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆల్‌టైమ్ రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు. పొట్టి వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో అమెరికా(USA)పై 44 రన్స్ కొట్టడం ద్వారా పాక్ సారథి ఈ మైలురాయికి చేరువయ్యాడు.
ప్రస్తుతం బాబర్ 4,067 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ 4,038, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 4,026 పరుగులతో వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు. ఈ మెగా టోర్నీ ముగిసే లోపు బాబర్ రికార్డును వీళ్లిద్దరు బ్రేక్ చేయడమే కాకుండా.. టాప్ స్కోరర్‌గా నిలిచే అవకాశం లేకపోలేదు. పొట్టి ఫార్మాట్ పరుగుల వీరుల జాబితాలో ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్(3,591), న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గుఫ్టిల్(3,531)లు నాలుగు, ఐదో ప్లేస్‌లో ఉన్నారు.
Leading the list 🔝@babarazam258 is the all-time top run-getter in T20Is 👏#T20WorldCup | #USAvPAK | #WeHaveWeWill pic.twitter.com/DoFs54cWZa
— Pakistan Cricket (@TheRealPCB) June 6, 2024
డల్లాస్ స్టేడియంలో బాబర్ సేనకు ఆతిథ్య యూఎస్ఏ పెద్ద షాకిచ్చింది. తొలుత నేత్రవల్కర్ సంచలన బౌలింగ్‌తో పవర్ ప్లేలోనే పాక్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో షాదాబ్ ఖాన్(40)తో కలిసి బాబర్ ఇన్నింగ్స్ నిర్మించాడు. అమెరికా బౌలింగ్ దాడిని ఎదుర్కోలేక పాక్ 159 పరుగులకే పరిమితమైంది.
The American fairytale continues 🇺🇸😍
USA beat Pakistan in one of the biggest results in #T20WorldCup history and are ready to take on India next.
Get your tickets now ➡️ https://t.co/FokQ0Cegga pic.twitter.com/ydqEQ3Onbx
— ICC (@ICC) June 6, 2024
అనంతరం యూఎస్ఏ కెప్టెన్ మొనాక్ పటేల్(50) అర్ధ సెంచరీతో మెరవగా.. విధ్వంసక హిట్టర్ అరోన్ జోన్స్(36 నాటౌట్) మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లాడు. ఇక సూపర్ ఓవర్లో పాక్ పేసర్ అమిర్ 7 వైడ్స్ ఇవ్వగా అమెరికా 18 రన్స్ సాధించింది. 19 పరుగులు కొట్టాల్సిన స్థితిలో పాకిస్థాన్ 13 పరుగులే చేసి పసికూన చేతిలో ఘోర ఓటమి చవిచూసింది.
Scenes from USA’s stunning victory in Dallas 😍🇺🇸#T20WorldCup #USAvPAK pic.twitter.com/bTipZM8env
— ICC (@ICC) June 6, 2024