Airtel | టీ-20 వరల్డ్ కప్ టోర్నీ యూజర్ల కోసం భారతీ ఎయిర్ టెల్ కొత్త రీచార్జ్ ప్లాను తెచ్చింది. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్‌తోపాటు ఎక్స్ ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం ఈ ప్లాన్లు తీసుకొచ్చింది. క్రికెట్ వీక్షకుల కోసం డిస్నీ + హాట్ స్టార్తోకూడిన ప్లాన్లు తెచ్చినట్లు ఎయిర్ టెల్ తెలిపింది. వరల్డ్ కప్‌ను వీక్షించేందుకు అమెరికా, కెనడాలకు ప్రయాణించే వారికి స్పెషల్ రోమింగ్ ప్లాన్లు కూడా తెచ్చింది.
రూ.499 నుంచి ప్రీ పెయిడ్ కస్టమర్లకు డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్లు మొదలవుతాయి. వేర్వేరు టైం లిమిట్స్, డేటా లిమిట్స్ తో మూడు ప్లాన్లు అందిస్తోంది. అత్యధికంగా రూ.3,359లతో కూడిన ప్లాన్ తో ఏడాది సబ్ స్క్రిప్షన్, ఓటీటీ బెనిఫిట్లు ఉన్నాయి. అదనంగా ఎటువంటి ఫీజు లేకుండానే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ద్వారా మరో 20 ఓటీటీలు ఎంజాయ్ చేయొచ్చు.
రూ.499 ప్లాన్ కింద 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజూ 3జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 3 నెలల గడువుతో కూడిన డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్, అపోలో 24/7 బెనిఫిట్లు ఉంటాయి.
రూ.869 ప్లాన్ కింద 84 రోజుల వ్యాలిడిటీ ఉండటంతోపాటు రోజూ 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, మూడు నెలల గడువుతో డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్, అపోలో 24/7 బెనిఫిట్లు ఉంటాయి.
రూ.3,359 ప్లాన్ కింద 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజూ 2.5 జీబీ డేటా పొందడంతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఏడాది గడువుతో డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీంలో సెలెక్టెడ్ ఓటీటీ ప్లాట్ ఫామ్, అపోలో 24/7 బెనిఫిట్లు ఉంటాయి.
ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో డిస్నీ + హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఏడాది పాటు ఉంటుంది. మూడు నెలల ఎక్స్ ట్రీమ్ ప్లే కూడా లభిస్తుంది. రూ.499తో ప్లాన్ మొదలవుతుంది. బేసిక్ ప్లాన్ తీసుకున్న వారికి ఎటువంటి యాడ్-ఆన్ లు లేకుండా 75 జీబీ డేటా లభిస్తుంది.
రూ.399 ప్లాన్ కింద 40జీబీ డేటా, రూ.499లో 75 జీబీ, రూ.599లో 75 జీబీ, ఒక యాడ్ ఆన్, రూ.999లో 100 జీబీ, మూడు యాడ్ ఆన్లు, రూ.1199 ప్లాన్‌తో 150 జీబీ , మూడు యాడ్ ఆన్లు, రూ.1,499 డేటా ప్లాన్ కింద 200 జీబీ, 4 యాడ్ ఆన్లు ఉంటాయి. రూ.1499 ప్లాన్ కింద 200 జీబీ డేటా, నాలుగు యాడ్ ఆన్లు ఉంటాయి. ఈ ప్లాన్లన్నింటిలోనూ ఏడాది గడువు గల డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్, ఎక్స్ ట్రీమ్ ప్లాన్ కూడా పొంది ఆనందించొచ్చు. ఒక్కో యాడ్ ఆన్‌లో 30 జీబీ డేటా అదనం.
డిస్నీ+ హాట్ స్టార్ తో కూడిన ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఫైబర్ డేటా ప్లాన్లు రూ.699 నుంచి మొదలవుతున్నాయి. ఈ ప్లాన్లతో ఎయిర్ టెల్ డిజిటల్ టవీ స్మార్ట్ బాక్స్ ద్వారా 350 టీవీ చానెళ్లను వీక్షించొచ్చు. డేటా స్పీడ్ ను బట్టి 40 ఎంబీపీఎస్ నుంచి ఒక జీబీపీఎస్ వరకూ మొత్తం ఆరు డేటా ప్లాన్లు ఉన్నాయి. వాటిల్లో అత్యంత ఖర్చుతో కూడుకున్నది రూ.3,999 చెల్లిస్తే సరిపోతుంది.
ఇక విదేశీ ప్రయాణికుల కోసం భారతీ ఎయిర్టెల్ కొత్తగా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లు తెచ్చింది. ఇవి ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీతో రూ.133 నుంచి ప్లాన్లు మొదలవుతున్నాయి.