ఆయూష్‌కు రజతం.. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ ఆయూష్ శెట్టి రజత పతకంతో మెరిశాడు. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో సత్తాచాటిన ఆయూష్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది.
నింగ్బో(చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ ఆయూష్ శెట్టి రజత పతకంతో మెరిశాడు. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో సత్తాచాటిన ఆయూష్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆయూష్ 8-21, 10-21తో షి యు కి(చైనా) చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్ షట్లర్ కునాల్వత్ విదిత్సరన్ను చిత్తుచేసి తుదిపోరుకు అర్హత సాధించిన ఈ 20 ఏండ్ల యువ షట్లర్ అదే పోరాట పటిమ కనబర్చలేకపోయాడు.
దీంతో గత ఆరు దశాబ్దాలుగా టోర్నీలో పసిడి పతకం కోసం భారత్ నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దినేశ్ కన్నా తర్వాత ఫైనల్ చేరిన రెండో భారత షట్లర్‌గా నిలిచిన ఆయూష్ కొత్త చరిత్ర లిఖించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 42 నిమిషాల్లోనే ముగిసిన పోరులో చైనీస్ షట్లర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. షి యు కి..ఆయూష్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా వరుస గేముల్లో మ్యాచ్‌ను తన సొంతం చేసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

