తైవాన్: తైపీ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్-300 టోర్నీలో తమకంటే మెరుగైన ర్యాంకు కలిగిన షట్లర్లను మట్టికరిపించిన భారత యువ షట్లర్లు ఉన్నతి హుడా, ఆయుష్ శెట్టి పోరాటం సెమీస్‌లోనే ముగిసింది.
శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ఉన్నతి.. 19-21, 11-21తో టొమొక మియజకి (జపాన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌లో కాస్త ప్రతిఘటించిన ఉన్నతి.. ప్రత్యర్థి దూకుడుతో రెండో గేమ్‌లో తేలిపోయింది. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఆయుష్.. 18-21, 17-21తో తైవాన్‌కు చెందిన ప్రపంచ ఏడో ర్యాంకర్ చో టైన్ చెన్ జోరుకు తలవంచాడు.