Axar Patel | టీమ్ ఇండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలో తండ్రి కాబోతున్నట్లు వెల్లడించారు. తన భార్య మేహ పటేల్ (Meha Patel) ప్రెగ్నెన్సీ (Pregnancy) వార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు సీమంతం వీడియోను షేర్ చేశారు. తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికేందుకు సద్ధమవుతున్నట్లు తెలిపారు.
త్వరలో తమ జీవితాల్లోకి ఆనందం రాబోతోంది.. అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు, పలువురు సెలబ్రిటీలు అక్షర్ పటేల్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అక్షర్ పటేల్ – మేహ పటేల్ది ప్రేమ వివాహం. చాలా కాలంగా డేటింగ్ చేసిన వీరిద్దరూ.. గతేడాది జనవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గుజరాతీ సంప్రదాయం ప్రకారం వీళ్ల పెళ్లి జరిగింది.
Also Read..
Vinesh Phogat | జులానాలో వినేష్ ఫొగాట్ విజయం
Azharuddin | ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత అజారుద్దీన్
Telangana | తెలంగాణ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్.. హోరాహోరీగా అథ్లెటిక్స్ పోటీలు