Telangana | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 7: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 10వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల తొలి రోజు సోమవారం జరిగిన బాలుర, బాలికల అండర్-16, 18, 20 విభాగాల్లో అథ్లెట్లు డిస్కస్‌త్రో, హైజంప్, షాట్‌పుట్, లాంగ్‌జంప్, జావెలిన్‌త్రో, 800మీ, 1000మీ, 5000మీ, 10వేల మీ రేస్‌వాక్ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. బాలుర అండర్-18 డిస్కస్‌త్రోలో సునీత్‌కుమార్, హైజంప్‌లో సిద్ధివినయ్, 5వేల మీ రేస్‌వాక్‌లో సాయిచరణ్‌రెడ్డి పసిడి పతకాలతో మెరిశారు.
బాలికల అండర్-18 కేటగిరీ షాట్‌పుట్‌లో రాజరాజేశ్వరి, 1000మీ పరుగులో అఖిల స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. మిగతా విభాగాల్లో ఈశ్వర్, సాయికిరణ్, విదిత్రెడ్డి, పవన్, విష్ణువర్ధన్, అంజి, శ్రీకాంత్, రాజేశ్, అమ్రీన్, కల్యాణి, బుచ్చమ్మ, ప్రవళిక స్వర్ణాలు దక్కించుకున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచే ప్లేయర్లు ఈనెల 25 నుంచి 29 వరకు భువనేశ్వర్‌లో జరిగే జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీకి ఎంపిక చేస్తారు. రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టాన్లీ జోన్స్, కార్యదర్శి సారంగపాణి, కోశాధికారి రాజేశ్‌కుమార్, రాజేశ్వర్‌రావు, కుమార్‌యాదవ్, మురళీధర్, వెంకటేశ్వర్‌రెడ్డి..విజేతలకు పతకాలు ప్రదానం చేశారు.