WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో మినీ వేలం మొదలైంది. ముంబైలో జరుగుతున్న వేలం పాటలో ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబే లిచ్ఫీల్డ్(Phoebe Litchfield) రికార్డు ధర పలికింది. శనివారం బీసీసీఐ అధ్యక్షుడు, డబ్ల్యూపీఎల్ ఛైర్ పర్సన్ రోజర్ బిన్ని(Roger Binny) వేలం ప్రక్రియను ప్రారంభించారు.
అనంతరం ఆక్షనీర్ మల్లికా సాగర్(Mallika Sagar) లిచ్ఫీల్డ్ పేరుతో వేలం మొదలెట్టింది. రూ.30 లక్షల కనీస ధరతో రిజిష్ఠర్ అయిన లిచ్ఫీల్డ్ కోసం యూపీ వారియర్స్(UP Warriorz), గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) పోటీ పడ్డాయి. చివరకు గుజరాత్ రూ. 1 కోటికి ఆమెను కొనుగోలు చేసింది.
Phoebe Litchfield attracts a bid of INR 1 CR from Gujarat Giants.
Gujarat Giants fans, how excited are you? 🥳#CricketTwitter | #WPLAuction | #WPL2024 pic.twitter.com/KtXcQFU9VP
— Female Cricket (@imfemalecricket) December 9, 2023
వచ్చే ఏడాది జరుగనున్న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ కోసం నేడు వేలం పాట నిర్వహిస్తున్నారు. మొత్తం 30 బెర్తుల కోసం 165 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత క్రికెటర్లతో పాటు వివిధ దేశాల ప్లేయర్లు తమ కనీస ధరతో వేలంలోకి అడుగుపెట్టారు.