Watch: యూపీలో దారుణం.. వృద్ధుడితో ఉమ్మి నాకించి, మెడలో చెప్పుల దండ వేసి ఊరేగింపు
Old Man Paraded With Shoes, Forced To Lick Spit | వృద్ధుడి మెడలో చెప్పుల దండ వేసి పశువులాగా ఊరేగించారు. అంతేగాక బలవంతంగా ఉమ్మి నాకించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: వృద్ధుడి మెడలో చెప్పుల దండ వేసి పశువులాగా ఊరేగించారు. అంతేగాక బలవంతంగా ఉమ్మి నాకించారు. (Old Man Paraded With Shoes, Forced To Lick Spit) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. తిఘరా గ్రామానికి చెందిన 75 ఏళ్ల మొహబ్బత్ అలీ తన కుమార్తెను అసభ్యకరంగా పట్టుకుని వేధించినట్లు ఒక వ్యక్తి ఆరోపించాడు.
ఈ నేపథ్యంలో గురువారం ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అలీ ఇంటికి వెళ్లారు. అతడ్ని బయటకు ఈడ్చుకుని వచ్చారు. ముఖానికి నల్ల రంగు పూశారు. మెడలో చెప్పుల దండ వేసి పశువుగా లాక్కెళ్లి ఊరేగించారు. ఆ తర్వాత అతడితో నేలపై ఉమ్మి వేయించి బలవంతంగా నాకించి క్షమాపణలు చెప్పించారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ సంఘటనపై స్పందించారు. జాఫర్, అమన్ పాండే, అఖిలేష్ సాహ్ని, ఘనశ్యామ్ తివారీని నిందితులుగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
सिद्धार्थनगर- मानवता को शर्मसार करने वाला वीडियो वायरल,दबंगों ने बुजुर्ग को चेहरे पर कालिख पोतकर घुमाया,दबंगों ने बुजुर्ग को जूते चप्पलों का माला पहनाई,कल का बताया जा रहा है वायरल वीडियो,गोल्हौरा थाना क्षेत्र के तिघरा गांव का है वीडियो.#siddharthnagar @Uppolice @siddharthnagpol pic.twitter.com/XUrAhgq7Pi
— Kapilvastu News Network (@Knewsnetwork19) December 8, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్‌పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

