Devara Movie | ఎన్టీఆర్ ‘దేవర’లో గుప్పెడంత మనసు బ్యూటీ..బంపర్ ఆఫర్ కొట్టేసిన కన్నడ భామ.!
Devara Movie | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’(Devara). కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంతో శ్రీదేవి గారలపట్టి జాన్వీకపూర్ (Janvi kapoor) తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది.
Devara Movie | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’(Devara). కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంతో శ్రీదేవి గారలపట్టి జాన్వీకపూర్ (Janvi kapoor) తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిభాగం 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తారక్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌లను రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
తెలుగు సీరియల్ ‘గుప్పెడంత మనసు తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ భామ జ్యోతి రాయ్ ‘దేవర’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు కానీ.. రీసెంట్గా జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో నెటిజన్లతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించింది.
మరోవైపు.. దేవర టీజర్‌ను డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 22న రెండు పాన్ ఇండియా సినిమాలు సలార్, డంకీ విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అదేరోజున ఈ సినిమాలతో దేవర టీజర్‌ను థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం దేవరకి సాలిడ్ రీచ్ దొరికేసినట్లే. ఓవర్సీస్లో డంకీ సినిమాకి, ఇండియాలో సలార్ సినిమాకి సాలిడ్ బజ్ ఉంది కాబట్టి ఈ సినిమాలకి పాటు దేవర టీజర్ అటాచ్ చేస్తే బాగుంటుంది అని మేకర్స్ అలోచిస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

