IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఒక్క ట్రోఫీ కూడా గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఒకటి. జట్టు నిండా స్టార్లు ఉన్నా సరే 17 సీజన్లుగా పంజాబ్ టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. అందుకని 18వ సీజన్ కోసం ఆ ఫ్రాంచైజీ గట్టిగానే సన్నద్ధమవుతోంది. ముందుగా కోచింగ్ సిబ్బందిపై గురి పెట్టిన యాజమాన్యం ఈమధ్యే ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ (Ricky Ponting)ను హెడ్‌కోచ్‌గా తీసుకుంది. ఇప్పుడు బౌలింగ్ కోచ్ వేటను వేగవంతం చేసింది. ఆసీస్‌కు చెందిన మాజీ పేసర్ జేమ్స్ హోప్ (James Hope) బౌలింగ్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
అంతేకాదు బ్యాటింగ్ కోచ్ అయిన బ్రాడ్ హడిన్, స్నిన్ బౌలింగ్ కోచ్ సునీల్ జోషీలను కూడా మరో సీజన్ కొనసాగించేందుకు పంజాబ్ యాజమాన్యం ఆసక్తి చూపిస్తోంది. పద్దెనిమిదో సీజన్ కోసం ఆరుగురిని అట్టిపెట్టుకొనే అవకాశం ఉంది. దాంతో ఆ ఆరుగురి ఎంపికపై పంజాబ్ ఫ్రాంచైజీ కసరత్తు మొదలెట్టింది. ఈ విషయమైన హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ నిర్ణయం తీసుకుంటాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
James Hopes is more likely to be a part of Punjab Kings as a bowling Coach.
( Telegraph )#IPL2025 #PunjabKings #IPLAuction pic.twitter.com/DAi1X2xtX6— PBKS TV (@PunjabkingsTV) October 17, 2024
పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)తో పాటు అన్క్యాప్డ్ ప్లేయర్‌గా శశాంక్ సింగ్ (Shashank Singh)లను పంజాబ్ రిటైన్ చేసుకోనుందని టాక్. మిగతా నలుగురిలో ఎవరు ఉంటారు? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక 17వ సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన పంజాబ్‌కు ప్రధాన కోచ్‌గా ట్రెవర్ బేలిస్, హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా సంజయ్ బంగర్లు సేవలందించిన విషయం తెలిసిందే.
ఐపీఎల్లో ఫేవరేట్ జట్టు అయిన పంజాబ్ 2014లో ఫైనల్ చేరింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో జరిగిన టైటిల్ పోరులో వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా(115 నాటౌట్) వీరోచిత సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్ మనన్ వొహ్రా(67) సైతం అర్ధ శకతం బాదగా పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. భారీ ఛేదనలో కోల్‌కతా హిట్టర్ మనీశ్ పాండే(94) దంచి కొట్టాడు. ఇక.. యూసుఫ్ పఠాన్ (34), కెప్టెన్ గౌతం గంభీర్(23)లు కూడా ఓ చేయి వేయగా… ఆఖర్లో పీయూష్ చావ్లా (13 నాటౌట్) సిక్సర్‌తో జట్టును గెలిపించాడు.
మనీశ్ పాండే(94), సాహా(115 నాటౌట్)