Ram – Lakshman | టాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ చేసిన ఒక పనికి ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాజా సాబ్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని అజీజ్ నగర్లో జరుగుతుండగా.. ఈ షూటింగ్ పక్కనే ఒక బండరాయి మధ్యలో తల్లి కుక్క ఇరుక్కోని ములుగుతూ ఉండగా.. వాటి పిల్లలు పక్కనే ఉండి అరుస్తూ ఉన్నాయి. అయితే ఆ పక్కనే ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఆ శబ్దం ఏంటి అని మేనేజర్ వెళ్లి చూడగా అక్కడ చిన్న కొండలో చిక్కుకుపోయిన ఓ కుక్క ఉంది. ఈ నేపథ్యంలో రామ్ – లక్ష్మణ్లతో పాటు అందరూ వెంటనే కుక్కను కాపాడేందుకు క్రేన్ సహాయంతో బయటకు తీయడానికి ప్రయత్నించారు.
అయితే క్రేన్ తాడు కూడా తెగిపోవడంతో.. బండరాయిని పక్కకు లాగుదామని ప్రయత్నించారు. కానీ అది కూడా అవ్వలేదు. దీంతో ఆ బండరాయిని కొంచెం పక్కకు తొలగించి కుక్క కాలుకి తాడుని కట్టి బయటకు లాగారు. అనంతరం ఆ కుక్కను దాని పిల్లల దగ్గరకు చేర్చారు రామ్ లక్ష్మణ్. ఈ క్రమంలోనే కుక్కకి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది.
Respect to the team of stunt masters Ram Lakshman for saving a dog trapped between the rocks! They really stepped up in a tough situation!@amalaakkineni1@rashmigautam27#RamLakshman #StuntMasters #Tollywood #MegastarChiranjeevi #Chiranjeevi #PawanKalyan #RamCharan #JrNTR… pic.twitter.com/RU4sMgZniv
— Karl Marx2.O (@Marx2PointO) October 18, 2024