సిడ్నీ : ఆస్ట్రేలియా పేసర్ జాయ్ రిచర్డ్సన్ తుంటి గాయంతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఈ నెల 31న ఆరంభం కానున్న ఐపీఎల్లో రిచర్డ్సన్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. అయితే గాయంతో చికిత్స చేయించుకోవడంతో అతడు భారత పర్యటనతోపాటు ఐపీఎల్‌కు దూరమయ్యాడు.
ఐపీఎల్‌కు దూరమవడం బాధగా ఉందని, అయితే త్వరగా కోలుకుని మరసటి సీజన్‌కు మెరుగైన ఆటగాడిగా వస్తానని రిచర్డ్సన్ అన్నాడు. 26 ఏళ్ల రిచర్డ్సన్ ఆస్ట్రేలియా తరఫున 3 టెస్టులు, 15 వన్డేలు, 18 టి20లు ఆడాడు.