Australian Open 2024 | ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో నిలిచింది వీళ్లే.. ఫేవరేట్లుగా నాదల్, ఒసాకా
Australian Open 2024 : వచ్చే ఏడాది జరుగబోయే ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open 2024) బరిలో నిలిచిన ఆటగాళ్ల జాబితా వచ్చేసింది. గురువారం ఈ టోర్నీ నిర్వాహకులు పురుషుల, మహిళల విభాగంలో పోటీ పడేవాళ్ల పేర్లను వెల్లడించారు. మహిళల డ్రాలో 99 మందికి...
Australian Open 2024 : వచ్చే ఏడాది జరుగబోయే ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open 2024) బరిలో నిలిచిన ఆటగాళ్ల జాబితా వచ్చేసింది. గురువారం ఈ టోర్నీ నిర్వాహకులు పురుషుల, మహిళల విభాగంలో పోటీ పడేవాళ్ల పేర్లను వెల్లడించారు. మహిళల డ్రాలో 99 మందికి నేరుగా అర్హత లభించగా.. పురుషుల డ్రాలో 97 మంది నేరుగా క్వాలిఫై అయ్యారు. 2024 ఆరంభంలో ఆస్ట్రేలియా వేదికగా జనవరి 14 నుంచి 28 వరకూ ఈ మెగా టోర్నీ జరుగనుంది.
ఈ ఏడాది జోరుమీదున్న నొవాక్ జకోవిచ్(Novak Djokovic), ఇగా స్వియటెక్(Iga Swiatek)లకు టాప్‌సీడ్ దక్కింది. ఈ మధ్యే తొడకండరాల గాయం నుంచి కోలుకున్న రఫెల్ నాదల్(Rafael Nadal), కాన్పు తర్వాత విరామం తీసుకున్న నొవామి ఒసాకా (Naomi Osaka) ఈ టోర్నీలో ఫేవరెట్లుగా బరిలోకి దిగబోతున్నారు. ఈ గ్రాండ్‌స్లామ్ పోరు కంటే ముందుగా వీళ్లిద్దరూ బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీతో పునరాగమనం చేయనున్నారు.
AO 2024 entry lists locked in. Let’s get this show on the road ☑️ 😎 https://t.co/fXGQluKVKn
— #AusOpen (@AustralianOpen) December 6, 2023
నాదల్‌తో పాటు యువకెరటాలు మరిన్ సిలిక్(క్రొయేషియా), డెనిస్ షపొవలోవ్, మిలోస్ రౌనిక్(కెనడా), రీలీ ఒపెల్కా(అమెరికా), జిరి వెస్లే(చెక్ రిపబ్లిక్)లు కూడా ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.
స్పెషల్ ర్యాకింగ్స్ ఆధారంగా ఒసాకా ఆస్ట్రేలియన్ ఓపెన్ బెర్తు దక్కించుకుంది. ఆమెతోపాటు జెన్నిఫర్ బ్రాడీ, అమందా అనిసిమోవ, షెల్బీ రోజర్స్, క్యాటీ మెక్‌నల్లి(అమెరికా), ఆంజెలిక్ కెర్బర్(జర్మనీ), అజీల తొమ్లనోవిక్(ఆస్ట్రేలియా) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇవి కూడా చదవండి
- Guwahati | గువాహటిలో స్వల్పంగా కంపించిన భూమి.. ఇండ్ల నుంచి పరుగులుతీసిన ప్రజలు
- Daggubati Abhiram | నేడు శ్రీలంకలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న దగ్గుబాటి అభిరామ్
- Gautam Gambhir | లెజెండ్స్ లీగ్‌లో గంభీర్ ఉగ్రరూపం.. ఈసారి ఎవరితో గొడవపడ్డాడంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

