Lie Detector Test : లై డిటెక్టర్ టెస్ట్.. మామూలుగా నేరస్తులకు, ఏదైనా కేసులోని నిందితులకు ఈ పరీక్ష చేస్తారు. కానీ, ఈసారి క్రికెటర్లకు ఈ టెస్టు నిర్వహించారు. అవును.. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్లకు లై డిటెక్టర్(Lie Detector Test) టెస్టు చేశారు. అంతేకాదు ‘తప్పు’ సమాధానం చెప్పినందుకు కొందరు షాక్ కూడా తిన్నారు తెలుసా. అయితే.. ఇదంతా సరదా కోసం చేసిందే. ఓ టీవీ షోలో ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins), టీ20 సారథి మిచెల్ మార్ష్, మార్నస్ లబూషేన్, ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాలు లై డిటెక్టర్ టెస్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఆస్ట్రేలియా క్రికెటర్ల చేతులకు ఓ బ్యాండేజ్ కట్టారు. అనంతరం తొలి రౌండ్లో భాగంగా వాళ్లను మీ అసలు పేరు ఏంటీ? అని అడిగారు. ఆ తర్వాత కంగారూ ఆటగాళ్లను పలు వివాదాస్పద, ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. అందుకు ఆసీస్ ఆటగాళ్లు నిజాయతీగా.. కాసింత సరదాగా జవాబులు చెప్పారు. తొలుత ఇంగ్లండ్ క్రికెటర్లు జానీ బెయిర్‌స్టో, స్టువార్ట్ బ్రాడ్‌లను ‘ఫ్లాంగ్స్’ అని పిలవనుందుకు కమిన్స్, మార్ష్‌లకు కరెంట్ షాక్ తగిలింది.
వన్డే వరల్డ్ కప్‌లో సెంచరీతో మెరిసిన ట్రావిస్ హెడ్(Travis Hhead) కూడా ఈ టెస్టులో దొరికిపోయాడు. అతడిని ముందుగా ఏం అడిగారంటే..? ‘ట్రావిస్.. నీకు పార్టీ అంటే ఇష్టమా?’ అని అడగగా.. అందుకు అతడు అవును అని చెప్పాడు. ‘వరల్డ్ కప్ విజయం తర్వాత నువ్వు వరల్డ్ కప్ వైన్ కాకుండా ఐదు కంటే ఎక్కువ బీర్లు తాగావా? పది.. 25 బీర్లు లాగిపడేశావా?’ అని నిర్వాహకుడు అడుగగా.. అందుకు హెడ్ నో అంటాడు. అతడు అబద్దం చెప్పాడని లై డిటెక్టర్ గుర్తిస్తుంద. దాంతో, హెడ్‌కు షాక్ తగులుతుంది.
ఆసీస్ క్రికెటర్ల లై డిటెక్టర్ టెస్ట్ వీడియో
ఇక.. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja)కు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. డేవిడ్ వార్నర్(David Warner) వీడ్కోలు తర్వాత ఆస్ట్రేలియా జట్టు మంచి వాతావరణంలో ఉందా? అనే ప్రశ్నకు అతడు నో చెప్పాడు. కానీ, ఆ తర్వాతి ప్రశ్నకు ఖవాజా దొరికిపోయాడు. మిచెల్ జాన్సన్ అంటే మీకు ఇష్టమా? అనే ప్రశ్నకు అవును అని చెప్పినందుకు ఖవాజాకు షాక్ తప్పలేదు. ఇలా.. ఆద్యంతం సరదాగా, సందడిగా సాగిన ఈ లై డిటెక్టర్ టెస్టు అభిమానులకు మాత్రం మస్త్ నవ్వు తెప్పించిందనుకోండి