GYM workouts in Saree : ఆరోగ్యం, అందం కోసం చాలామంది జిమ్‌కి వెళుతుంటారు. అయితే జిమ్‌లో వర్కవుట్స్ చేయాలంటే వదులుగా, సాగే లక్షణం ఉన్న ప్రత్యేక దుస్తులను ధరిస్తారు. కానీ ఇక్కడ కొందరు మహిళలు మాత్రం సంప్రదాయ చీర కట్టులోనే వ్యాయామం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వీరి వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో చీరలు ధరించిన కొందరు మహిళలు జిమ్‌లొ సీరియస్‌గా ఎక్సర్సైజులు చేస్తున్నారు. ఈ మహిళలపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చీర కట్టుకుని జిమ్‌లో వ్యాయామం చేయడం కొంచెం కష్టమే. చీర కట్టుకుని జిమ్‌లో పరికరాలను ఉపయోగించడం అంత సులభం కాదు. అయితే జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం జిమ్‌లో వ్యాయామం అసాధ్యం కాదు.
అయితే ఈ మహిళలు రోజూ చీరకట్టులో వర్కవుట్స్ చేసేవాళ్లు కాదని, కేవలం రీల్స్ కోసం వాళ్లు ఇలా చీరకట్టులో జిమ్‌లో వ్యాయామం చేశారని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ స్టంట్స్ అన్ని రీల్స్, వ్యూస్ కోసమే అంటున్నారు. వాళ్లు చేసింది పబ్లిసిటీ కోసమే అయితే మాత్రం అందులో తప్పేముందని మరికొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 1.2 మిలియన్ మంది వీక్షించారు.
कितनी संस्कारी महिला है, जिम मे भी साडी पहन के गई है…
लेकिन जल्दबाजी मे ब्लाउज पहनना भूल गई।
😜😜😜😜😜😜😜😜 pic.twitter.com/kOlBknuXk9— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) August 29, 2024