సిడ్నీ: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన ఆస్ట్రేలియా (IND vs AUS) క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని టీమ్ఇండియా భావిస్తున్నది. ఈ నేపథ్యంలో సిడ్నీ వన్డేలో (Sydney ODI) టాస్ గెలిచిన ఆసీస్ సారథి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో వరుస వైఫల్యాలతో ఉన్న టీమ్ఇండియా ఆస్ట్రేలియా విధించే టార్గెట్‌ను చేజ్ చేస్తుందో లేదో చూడాల్సిందే. కాగా, వన్డేల్లో భారత్ టాస్ ఓడిపోవడం వరుసగా ఇది 18వ సారి కావడం గమనార్హం.
జట్టు కూర్పుపై విమర్శలు వెళ్లువెత్తుండటంతో టీమ్ఇండియాలో రెండు మార్పులు చోటుచేసుకున్నారు. అంతగా ఆకట్టుకోని నితీశ్ రెడ్డిపై వేటు పడగా, అర్ష్‌దీప్‌ను జట్టు నుంచి తప్పించారు. ఇక వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. గంభీర్ మద్దతు పుష్కలంగా ఉన్న హర్షిత్ రాణా తన స్థానాన్ని కాపాడుకున్నాడు.
భారత జట్టు: గిల్, రోహిత్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రాహుల్, అక్షర్ పటేల్, సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ.
🚨 Toss 🚨#TeamIndia have been asked to bowl first in the 3️⃣rd ODI in Sydney.
Updates ▶ https://t.co/4oXLzrieDe#AUSvIND pic.twitter.com/quvbzmy5NO
— BCCI (@BCCI) October 25, 2025