హోబర్ట్: సొంతగడ్డపై పాకిస్థాన్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా టీ20లలో మాత్రం దుమ్మురేపింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన మూడో టీ20లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో గెలిచి 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. 18.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది.
బాబర్ ఆజమ్ (41) టాప్ స్కోరర్ కాగా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఛేదనను ఆసీస్.. 11.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. మార్కస్ స్టోయినిస్ (27 బంతుల్లో 61 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. స్టోయినిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, జాన్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి.