లాహోర్: వచ్చే నెలలో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరనున్నది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్(PAKvAUS)లో పర్యటించనున్నది. వరల్డ్‌కప్ ప్రిపరేషన్లో భాగంగా పాకిస్థాన్‌తో మూడు టీ20 మ్యాచ్‌లను ఆస్ట్రేలియా ఆడనున్నది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జనవరి 29, 31, ఫిబ్రవరి ఒకటో తేదీన ఆ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
అయితే ఆస్ట్రేలియా తన వరల్డ్‌కప్ మ్యాచ్‌లను ఇండియాలో ఆడనున్నది. ఇక పాకిస్థాన్ తన మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగా ఆడనున్నది. ఏప్రిల్ 2022లో చివరిసారి ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది. జనవరి 28వ తేదీన ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌కు చేరుకోనున్నది. గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీలో కొన్ని మ్యాచ్‌లను పాకిస్థాన్ వేదికగా ఆస్ట్రేలియా ఆడింది.
ఆసీస్‌తో జరిగే సిరీస్‌కు చెందిన జట్టును పాకిస్థాన్ త్వరలో ప్రకటించనున్నది. పాక్ కోచ్ మైక్ హెస్సాన్, కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఈ అంశంపై భేటీకానున్నారు.
Pakistan lock in dates for Australia series ahead of #T20WorldCup 📅#PAKvAUS | Read more ⬇️https://t.co/B5dXgLMr4B
— ICC (@ICC) January 14, 2026