BGT 2024-25 : ప్రతిష్ఠాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు (Team India) ఆస్ట్రేలియా గడ్డపై కాలు పెట్టింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)తో కూడిన మొదటి బృందం తొలి టెస్టుకు వేదికైన పెర్త్‌కు చేరుకుంది. దాంతో, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా, ఆసీస్ జట్ల గత పోరాటాలను వర్ణిస్తూ ఆస్ట్రేలియా పత్రికలు కథనాలు రాశాయి. విశేషం ఏంటంటే.. భారతీయ భాషలైన హిందీ, పంజాబీలో వార్తలు ప్రచురించాయి. దిగ్గజ ఆటగాడైన విరాట్ కోహ్లీని కొత్త కింగ్ అని కొనియాడుతూ ఫుల్‌పేజీ కథనం ప్రచురించాయి.
ఆస్ట్రేలియాకు చెందిన డెయిలీ టెలిగ్రాఫ్ (Daily Telegraph) అనే పత్రిక మంగళవారం హిందీ, పంజాబీ భాషలో భారీ కథనాలు రాసింది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని పునస్కరించుకొని ‘ఏండ్ల తరబడిసాగుతున్న పోరాటం’ అంటూ పెద్ద హెడ్డింగ్‌తో వార్త ప్రచురించింది. ఆ వార్తకు విరాట్ కోహ్లీ ఫొటో పెట్టి.. ‘ది న్యూ కింగ్’ అంటూ అతడిని పొగిడేసింది.
When some Indian paid media is busy demeaning Virat Kohli, Australian media never fails to acknowledge the GOAT’s presence pic.twitter.com/UTryOvv7h3
— Pari (@BluntIndianGal) November 11, 2024
ఇక స్పోర్ట్స్ పేజీలో టీమిండియా యువకెరటం యశస్వీ జైస్వాల్ శతక గర్జన ఫొటోను ప్రచురించింది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టుకు కీలకమైన కోహ్లీ, యశస్వీలు ఇప్పటికే ఆసీస్ చేరుకున్నారు. హెడ్ కోచ్ గౌతం గంభీర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాల నేతృత్వంలోని రెండో బృందం కూడా ఆసీస్ బయలేదేరింది.
నవంబర్ 22న పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాను భారత జట్టు ఢీ కొట్టనుంది. గత పర్యటనలో పెర్త్ మైదానంలో జరిగిన గులాబీ టెస్టు(Pink Test)లో 36 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. రిషభ్ పంత్, ఛతేశ్వర్ పూజారా, అజింక్యా రహానేల అసమాన పోరాటంతో సిరీస్ కైవసం చేసుకుంది.
Look at The last 8 Border-Gavaskar Trophies winners 🏆
Can India win once again BGT ? 👀 pic.twitter.com/9SZtcJ2pgD
— IPLnCricket: Everything about Cricket (@IPLnCricket) November 6, 2024
అయితే.. అనుభవజ్ఞులైన పుజరా, రహానేలు ఇప్పుడు జట్టులో లేరు. కుర్రాళ్లలో శుభ్‌మన్ గిల్, పంత్‌లకు మాత్రమే కంగారూ గడ్డపై ఆడిన అనుభవం ఉంది. దాంతో, యశస్వీ జైస్వాల్‌తో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్లు చెలరేగి ఆడాలని కోచ్ గంభీర్ కోరుకుంటున్నాడు.