సిడ్నీ: మరికొద్దిరోజుల్లో స్వదేశంలో భారత్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో పాటు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (రెండింటికి)కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్లను ప్రకటించింది. వెన్నునొప్పి గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ సిరీస్‌ల నుంచి తప్పుకోవడంతో టీ20లకు సారథిగా ఉన్న మిచెల్ మార్ష్‌కు సీఏ ఆ బాధ్యతలను అప్పగించింది.
ఈ ఏడాది ఆగస్టులో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత విరామం తీసుకున్న స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. టీ20లకు అతడు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్క్‌తో పాటు మాథ్యూ రెన్షా, మిచెల్ ఒవెన్‌కు వన్డే జట్టులో చోటుదక్కింది. ఫామ్ కోల్పోయిన లబూషేన్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపారు.
వన్డే జట్టు: మార్ష్ (కెప్టెన్), బార్ట్లెట్, క్యారీ, కనోలి, డ్వార్షియస్, ఎల్లిస్, గ్రీన్, హాజిల్‌వుడ్, హెడ్, ఇంగ్లిస్, ఒవెన్, రెన్షా, షార్ట్, స్టార్క్, జంపా
టీ20లకు: మార్ష్ (కెప్టెన్), అబాట్, బార్ట్లెట్, ఎల్లిస్, డేవిడ్, డ్వార్షియస్, హాజిల్‌వుడ్, హెడ్, ఇంగ్లిస్, కుహ్నెమన్, ఒవెన్, షార్ట్, స్టోయినిస్, జంపా