లండన్: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా రెండో విజయానికి చేరువైంది. 371 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. శనివారం ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. క్రాలీ (3), పోప్ (3), బ్రూక్ (4), రూట్ (18) విఫలం కాగా.. బెన్ డకెట్ (50), కెప్టెన్ స్టోక్స్ (29) పోరాడుతున్నారు.
ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు 130/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా చివరకు 279 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖవాజా (77) టాప్ స్కోరర్.