AUS vs NZ | షార్జా: మహిళల టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరుస విజయాల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బేత్మూనీ(40), ఎలీస్ పెర్రీ (30) బ్యాటింగ్‌తో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 148/8 స్కోరు చేసింది.
అమెలియా కెర్ (4/26) రాణించింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కివీస్..స్కట్ (3/3), సదర్లాండ్ (3/21) ధాటికి 19.2 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. మేగన్ స్కట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.