Madhukaran | క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలి : ఇండియన్ ఉమెన్స్హాకీ మాజీ టీం కోచ్
Madhukaran | క్రీడాకారులు పతకాలు సాధించి జాతీయస్థాయిలో రాణించాలని మాజీ ఇండియన్ ఉమెన్స్ హాకీ మాజీ టీం కోచ్ మధుకరణ్ సూచించారు.
హనుమకొండ చౌరస్తా : క్రీడాకారులు (Athletes ) పతకాలు సాధించి జాతీయస్థాయిలో రాణించాలని మాజీ ఇండియన్ ఉమెన్స్ హాకీ మాజీ టీం కోచ్ మధుకరణ్ ( Madhukaran ) సూచించారు. 8వ తెలంగాణ హ్యాండ్ బాల్( Hand Ball ) ట్యాలెంట్ హంట్, 41వ సౌత్ ఇండియా హ్యాండ్బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హ్యాండ్బాల్ కోర్టులో రెండోరోజు హోరాహోరీగా కొనసాగాయి.
మూడురోజుల ఈ పోటీలను డీఎస్పీ(ఏఆర్), జాతీయ హ్యాండ్బాల్ ప్లేయర్ పీఎస్ శశిధర్ జ్ఞాపకార్థం రెడ్ షూటర్స్ అండ్ తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్కుమార్ తెలిపారు. రెండోరోజు మధుకరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించి మాట్లాడారు.
క్రీడలు మానసికోల్లాసానికి ఎంతో దోహదపడతాయని, హ్యాండ్బాల్ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి భారత్కు పతకాలు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా మధుకరణ్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి శ్యాం, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

