Asia Cup 2025 : అసియా కప్‌లో ఆరంభ పోరులో అఫ్గనిస్థాన్ (Afghanistan) భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ సెడీఖుల్లా అటల్(73 నాటౌట్), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్(53) అర్థ శతకాలతో కదం తొక్కగా 188 రన్స్ చేసింది. హాకాంగ్ బౌలర్ల ధాటికి అఫ్గన్ మిడిలార్డర్ విఫలమైనా.. అటల్ క్రీజులో పాతుకుపోయి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక డెత్‌ఓవర్లలో అజ్మతుల్లా ఓ రేంజ్లో రెచ్చిపోయాడు. ఆకాశ్ శుక్లా ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 24 రన్స్ పిండుకున్న అతడు జట్టు స్కోర్ దాటించాడు. ఆ తర్వాత నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 రన్స్ చేయగలిగింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న అఫ్గనిస్థాన్‌కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్ సెదీఖుల్లా అటల్(73 నాటౌట్) మొదటి ఓవర్లోనే మూడు ఫోర్లతో తన ఉద్దేశాన్ని చాటాడు. అయితే.. మూడో ఓవర్లో డేంజరస్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్జాబ్ (8) ఔటయ్యాడు. ఆయుశ్ శుక్లా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన అతడు మిడాఫ్‌లో నిజాకత్ ఖాన్‌కు దొరికిపోయాడు. దాంతో, 25 పరుగుల వద్ద అఫ్గన్ జట్టు తొలి వికెట్ పడింది. ఆ తర్వాత ఇబ్రహీం జద్రాన్(1) వెంటనే వెనుదిరిగాడు. ఒక్క పరుగు వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు పడిన వేళ సీనియర్ బ్యాటర్ మొహమ్మద్ నబీ(33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హాంకాంగ్ స్పిన్నర్లను ఉతికేస్తూ అతడు బౌండరీలతో చెలరేగాడు. దంచికొడుతున్న అతడిని కిన్చిత్ షా పెవిలియన్ పంపగా.. గుల్బదిన్ నయీబ్(5) ఇలా వచ్చి అలా వెళ్లాడు.
First 15 overs: 110 runs
Last 5 overs: 78 runs 🔥A trademark Afghanistan innings!#AFGvHK SCORECARD 👉 https://t.co/eo5GtCWQob pic.twitter.com/xpgEZd4CDL
— ESPNcricinfo (@ESPNcricinfo) September 9, 2025
నబీ, నయీబ్‌లు వెంవెంటనే ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్(53 నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్‌తో దడపుట్టించాడు. హాంకాంగ్ ప్రధాన పేసర్ ఆకాశ్ శుక్లా ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత బంతిని స్లిప్‌లో కట్ చేసిన అజ్మతుల్లా 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఉత్సాహంతో నాలుగో బంతిని పెద్ద షాట్ ఆడబోయి ఔటయ్యాడు. 20వ ఓవర్లో 9 పరుగులు రావడంతో కాబూలీ టీమ్ ప్రత్యర్థికి 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.