Uma Chetry : భారత మహిళల క్రికెట్ జట్టులోకి కొత్త తార దూసుకొచ్చింది. ఫుట్‌బాల్, బాక్సింగ్ వంటి ఆటలకు పాపులర్ అయిన ఈశాన్య రాష్ట్రం అస్సాం(Assam) నుంచి టీమిండియా జెర్సీ(Team India Jersey) వేసుకోనుంది. ఆ స్టేట్ నుంచి భారత జట్టుకు ఎంపికైన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె పేరు ఉమా ఛెత్రి (Uma Chetry). దక్షిణాఫ్రికా(South Africa)తో మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం శుక్రవారం బీసీసీఐ ప్రకటించిన స్క్వాడ్‌లో వికెట్ కీపర్, బ్యాటర్ అయిన ఉమ చోటు దక్కించుకుంది.
టీమిండియా స్క్వాడ్‌లో ఉమకు అనుకోకుండా చాన్స్ దక్కింది. రెగ్యులర్ వికెట్ కీపర్ యస్తికా భాటియా (Yastika Bhatia) గాయపడడంతో సెలెక్టర్లు ఉమకు అవకాశమిచ్చారు. అస్సాం క్రికెట్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిన ఆమెకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Himantha Biswa Sarma) ఎక్స్ వేదకగా ఉమకు కంగ్రాట్స్ చెప్పారు.
Congratulations to rising star Uma Chetry on being selected to the Indian Cricket Team for the upcoming series against South Africa.
She is the first player from Assam to be selected in the Test squad of a cricket tournament.
My heartiest congratulations and best wishes to Uma! pic.twitter.com/2ES3J2KbHz
— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) May 31, 2024
గోలాఘట్ జిల్లాలోని కండులిమరి ఉమ సొంతూరు. చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలనే లక్ష్యం పెట్టుకున్న ఆమె భారత ‘ఏ’ జట్టుకు ఆడింది. అంతేకాదు మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో యూపీ వారియర్స్(UP Warriorz) తరఫున మెరిసింది. అంతటితోనే ఆగకుండా సీనియర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాలని 20 ఏండ్ల ఉమ కలలు కనేది. అనుకున్నట్టుగానే సఫారీ సిరీస్‌తో ఉమ కల నిజమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్.. దక్షిణాఫ్రికా మూడు వన్డేలు, మూడు టీ20లు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.