సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : డిసెంబర్ 31 సంబురాల సందర్భంగా నగరవాసుల సౌలభ్యం కోసం మెట్రో ప్రత్యేక చర్యలు తీసుకున్నది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, ఒంటి గంట తర్వాత మెట్రో స్టేషన్ ప్రాంగణంలోకి అనుమతి ఉండదని నిర్వాహకులు పేర్కొన్నారు.
న్యూ ఈయర్ వేడుకల సందర్భంగా ప్రజా రవాణా వినియోగంతో సురక్షితంగా నగరవాసులు చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచినట్లుగా తెలిపారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.