పీర్జాదిగూడ, డిసెంబర్ 30: బోడుప్పల్ సర్కిల్ పీర్జాదిగూడ డివిజన్ పరిధిలోని మేడిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆవరణలో మూడు కోర్టు హళ్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టును మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రొటోకాల్ ఇన్చారి,్జ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే.లక్ష్మణ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి, జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అమరేందర్‌రెడ్డి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.