సిటీబ్యూరో, డిసెంబరు 30 (నమస్తే తెలంగాణ): కొన్ని రోజులుగా గ్రేటర్లో చలిపులి పంజా విసురుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే తక్కువకు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతుంది.
సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13.1డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.6డిగ్రీలు, గాలిలో తేమ 34 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.